ఆలూ తో తెల్లజుట్టు నివారణ || white hair treatment with Potatoes || white hair dye - Jobs Notifications

Jobs Notifications

Jobs Notifications

Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

Saturday, June 17, 2017

ఆలూ తో తెల్లజుట్టు నివారణ || white hair treatment with Potatoes || white hair dye

ఆలూ తో తెల్లజుట్టు  నివారణ ➤ white hair treatment with Potatoes



          ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోగ్య సమస్యలతో పాటు, చిన్న పిల్లల దగ్గరనుంచి, 40 ఏళ్ళ లోపు వరకు, దాదాపుగా అందరూ ఎదుర్కొంటున్న సమస్య...తెల్ల జుట్టు. పూర్వం 60ఏళ్ళ వయసువరకు కూడా, జుట్టు నెరవడం అనేది, చాలా తక్కువగా ఉండేది. కాని ఈనాడు చిన్న వయసు నుంచే, అంటే 11, 12 ఏళ్ళ నుంచే ఈ సమస్య మొదలైపోతోంది. ఈ తెల్ల జుట్టు సమస్య నుంచి బైటపడటానికి హానికరమైన కేమికాల్స్ తో కూడిన డై లను వాడుతున్నారు. కొన్ని రకాల డై ల వల్ల దృష్టి మందగించడం, side effects తో బాధపడుతున్నారు. 
      వయసు మీద పడుతున్న కొద్దీ, తల మీది చర్మం పై జుట్టును ఉత్పత్తి  చేసే మెలనిన్ సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. క్రమంగా జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. కొంతమంది లో పూర్తిగా తెల్ల రంగులోకి మారిపోతుంది. అయితే ఈ సమస్యకు, రసాయనాలతో కూడిన హానికరమైన రంగులను వాడకుండా, మనమే స్వయంగా ఇంట్లో తయారు చేసుకోగల ఒక చిట్కాను చూద్దాం.  ఇందుకు కావలసినవి….ఒక శుభ్రం చేసిన ఖాళీ షాంపూ సీసా, చిన్నవైతే 7-8, పెద్దవైతే 5-6 బంగాళదుంపలుషాంపూ ఇంకా కండీషనర్.

ముందుగా ఎలా  తయారు చెయ్యాలో చూద్దాం.

ముందుగా బంగాళా దుంపలను కడిగి, పై  తొక్క తీసి , తగినన్ని నీళ్ళలో  వేసి 20-30 నిముషాలు ఉడికించాలి .  తరువాత , ఆ మిశ్రమాన్ని చల్లార్చి, Filter  చేసి ఒక సీసాలో పోసి, జాగ్రత్తగా Refrigerator లో ఉంచాలి . 

        ఇప్పుడు ఎలా వాడాలో తెలుసుకుందాం: ముందుగా, తక్కువ గాఢత కలిగిన, నాణ్యమైన  షాంపూతో జుట్టుని శుభ్రంగా కడిగి, కండిషనర్ పెట్టాలి. తరువాత ఎక్కువ నీటితో మరోసారి, జుట్టును కడగాలి. ఇప్పుడు  ఫ్రిడ్జ్ లో నిలువ చేసుకున్న బంగాళా దుంపల ద్రవాన్ని, జుట్టు కుదుళ్ళ నుంచి, చివర్ల వరకు పట్టించాలి. 15-20 నిమిషాలపాటు ఉంచి, తరువాత, గోరువెచ్చని నీటితో కడిగెయ్యాలి. షాంపూ వాడరాదు.

         అయితే, పై పై చిట్కాలు ఎన్ని పాటించినా, మన రోజువారీ జీవితం లో కొన్ని నియమాలు పాటిస్తేనే ఏ చిట్కాలైనా పనిచేస్తాయి. అవి ఏంటో చూద్దాం.  ఒత్తిడిని నివారించడం చాలా అవసరం. ఈ ఒత్తిడి కారణంగా, మానాసికంగానే కాక, శారీరకంగానూ అలసిపోతాము. దీని వల్ల, సమయానికి భోజనం చెయ్యలేరు. భోజనం సరిగ్గా చెయ్యకపోతే, సరైన నిద్ర ఉండదు. నిద్ర తగినంత లేకపోతే, శరీరం నిస్సత్తువ గా మారిపోతుంది. వీటి కారణంగా, చర్మం బిగువు కోల్పోతుంది. కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. కనుబొమ్మలు, కను రెప్పలు, రాలిపోతాయి. జుట్టు విపరీతంగా ఊదిపోవడమే కాకుండా, త్వరగా తెల్లబడిపోతుంది. 

వీటిని నివారించాలంటే, ప్రతి రోజు కనీసం 8 గ్లాసుల శుభ్రమైన మంచి నీళ్ళు తాగాలి. కాఫీ లాంటివి తాగే అలవాటు ఉంటే, మెల్లగా తగ్గించుకుని, రోజు లో ఒక్కసారి మాత్రేమే తాగితే మంచిది. ఆకు కూరలు, పాలు, గుడ్లు, అలాగే, రాగి అధికంగా దొరికే ఆహారపదార్థాలు మీ ఆహారం లో ఉండేలా చూసుకోండి. అలాగే..పైన్ ఆపిల్, బ్లాకు బెర్రీస్, పాలకూర, బీన్స్, బాదం ఇంకా దానిమ్మ మొదలైనవి. మీ జుట్టు ఆరోగ్యంగాఆకర్షణీయంగా ఉండాలంటే, ఆల్కహాల్ ఇంకా ధూమపానం తీసుకోవడం కూడా నిషేధిస్తే , ఆరోగ్యమైన, అందమైన నల్లని ఒత్తైన జుట్టు మీ సొంతమవుతుంది. 

No comments:

Post a Comment

Post Top Ad