చైనా లో ఉద్యోగుల పాలిట ధనలక్ష్మీ➤ Get 15$ on 1 kg weight loss - Jobs Notifications

Jobs Notifications

Jobs Notifications

Responsive Ads Here

Post Top Ad

Your Ad Spot

Friday, June 16, 2017

చైనా లో ఉద్యోగుల పాలిట ధనలక్ష్మీ➤ Get 15$ on 1 kg weight loss

చైనా లో ఉద్యోగుల పాలిట ధనలక్ష్మీ Get 15$ on 1 kg weight loss


నేటి ఆదునిక ప్రపంచం లో డబ్బు లేని జీవితాలు చాలా దుర్భరం గా గడుస్తాయి అనేది వాస్తవ  మాట . ఎందుకంటె డబ్బుకోసం మనషులు  ఏమైనా,  ఏదైనా చేయగలరు, చేస్తారు  అని మనదరికి తెలుసు . ఎందుకంటె డబ్బుకోసం  ఎంత కష్టమైనా పనినైనా, అవసరాన్ని బట్టి  అన్ని ఏర్పాటు చేసుకొని మరీ, ఆ కష్టానికి ఎదురీదుతాం. ఎందుకంటె డబ్బు మానవ జీవితాలను శాసిస్తుంది కాబట్టి 
ప్రతి ఒక్కరు తమతమ  జీవితాలలో  వెలుగులు నింపుకోవాలని అహర్నిశలు కష్టపడి డబ్బుని సంపాదిస్తారు. అలా సంపాదించిన సొమ్మును ఎవరు  దోచుకోకుండా ఎన్ని జాగ్రత్తలు పాటించాలో అన్ని జాగ్రత్తలు పాటిస్తారు. ప్రశాంతమైన జీవితం ఒక్క డబ్బు ఉంటేనే దక్కుతుంది అనుకుంటే పొరపాటే. డబ్బుతో సమానమైనది మంచి ఆరోగ్యం.  మరి మన ఆరోగ్యం గురించి జాగ్రతలు పాటిస్తూ ,  అధికంగా డబ్బు సంపాదించుకునే అవకాశం దొరికితే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి. 

      చైనా దేశం  లోని xian city లో ఉన్న  xian jingatian అనే  investment consulting company అదినేత wang  ఒక వినూత్న ఆలోచన చేసారు. ఆ ఆలోచనే ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఉన్న ఉద్యోగులకు ధనలక్ష్మి  కురిపించే వరంగా మారింది . ఎందుకంటె  wang ఒకరోజు తన కంపనీలో పనిచేస్తున్న ఉద్యోగులను చూసినప్పుడు , వాళ్ళు గంటలతరబడి అటు ఇటు కదలకుండా పనిచేయడం గమనించాడు. 

అలా పనిచేయడం ద్వార అధిక బరువు పెరిగి నానా అనారోగ్యాలను తేచుకుంటున్నారు అని కలత చెందాడు. కొంతమంది వైద్యనిపుణులను కలిసి అధిక బరువు వల్ల వచ్చే అనరోగ్య సమస్యలను తెలుసుకున్నాడు . ఆ సమస్యలు అన్ని ఇన్ని కావు రక్తపోటు , షుగర్, కిల్లనోప్పులు , ఒబేసిటీ  తో కాన్సర్….ఇలా ఎన్నో …అలా తెలుసుకున్న మరుక్షణం wang ఆలస్యం చేయకుండా తన company లో meeting ఏర్పాటు చేసి ఎవ్వరైతే 1kg బరువు తగ్గుతారో వారికీ నెల జీతంతో పాటు అధికంగ 15 dollars  ఇస్తాము అని ప్రకటన చేసాడు. ఇక్కడో చిన్న మెలిక ఏంటంటే, ఉద్యోగులు తమ Body Mass Index లెక్కలకు తగ్గట్టుగా, ఎన్ని కిలోలు తగ్గితే, కిలో కి 15 డాలర్ల చొప్పున, జీతం తో పాటు అదనంగా ఇస్తారు. ఇది విన్న ఉద్యోగులు ప్రతినెల gym లకు వెళ్ళి మరీ, తమ  ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ బరువు తగ్గి  తమ  boss డాలర్స్ రూపం లో ఇచ్చే  నజరానను అందుకుంటూ, మంచి ఆరోగ్యం తో సంతోషంగా ఉన్నారు .
Wang చేసిన ఈ ఆలోచన గురించి తెలిసిన  ప్రపంచ దేశాల కంపెనీలు అన్నీ కూడా, తమ ఉద్యోగుల ఆరోగ్యం పట్ల,  ఇదే తరహాలో ఆలోచిస్తున్నాయట.
      

No comments:

Post a Comment

Post Top Ad